Google search engine
HomeAndhra Pradeshపవన్ కళ్యాణ్ కు BJP బంపర్ ఆఫర్ - TDP కి బిగ్ షాక్..! -...

పవన్ కళ్యాణ్ కు BJP బంపర్ ఆఫర్ – TDP కి బిగ్ షాక్..! – Sree Prasthanam

Sree Prasthanam : ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఓ వైపు వైసీపీలో అసమ్మతి సెగలు చెలరేగుతుండగా.. టీడీపీ-జనసేన పొత్తుపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో క్వశ్చన్ మార్క్‌గా మారింది. ఇటు మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్‌ వరించడం… టీడీపీ పొత్తు ధర్మం పాటించడం లేదని పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్‌తో చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్‌కు బీజేపీ  టెంప్టింగ్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సరిగ్గా ఎన్నికలకు ముందు.. ఆంధ్ర పాలిటిక్స్‌ను మలుపు తిప్పే రాజకీయం తెరపైకి వచ్చిందని సమాచారం. బీజేపీ అధిష్టానం నుంచి పవన్‌కు స్పష్టమైన డైరెక్షన్‌ వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పవన్‌ను ఢిల్లీకి పిలిపించి.. పొత్తుల విషయంపై చర్చలు జరపనున్నారు.

జనసేనతో సంప్రదించకుడా అరకు, మండపేట స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ విషయంపై జనసేన నాయకులు పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించారు. పొత్తులో ఉన్నప్పుడు చర్చలు జరపకుండా అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారని.. మనం కూడా అభ్యర్థులను ప్రకటిద్దామని ఒత్తిడి చేశారు. శుక్రవారం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఉన్న ఒత్తిడితో అభ్యర్థులను ప్రకటించారని.. తనకు కూడా ఉన్న ఒత్తిడి కారణంగా రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. రాజోల్, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని చెప్పారు. టీడీపీ పొత్తు ధర్మం పాటించలేదని.. రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్తేనే బలమైన నిర్మాణం చేసుకోవచ్చన్నారు. లోకేష్‌ ముఖ్యమంత్రి పదవిపై తాను మాట్లాడినా మౌనంగా ఉన్నానని అన్నారు. 

ఇన్నాళ్లు పొత్తుతోనే పోటీలోకి దిగుతామని ప్రకటించిన టీడీపీ-జనసేన.. ఇలా సడెన్‌గా ఎవరికి వారే అభ్యర్థులను ప్రకటించడం కలవరం చెలరేగుతోంది. పవన్‌కు బీజేపీ నుంచి డైరెక్షన్‌ వచ్చిందని.. అందుకే టీడీపీపై విమర్శలు చేశారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీతో కాకుండా జనసేన-బీజేపీ కలిసి పోటీ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కొన్ని సీట్లు గెలిచినా.. వచ్చే ఎన్నికల నాటికి కచ్చితంగా అధికారంలోకి వస్తామని బీజేపీ అధిష్టానం పవన్‌తో చెప్పే అవకాశం ఉంది.

Sree Prasthanam Telugu Daily News Paper

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments