Google search engine
HomeAndhra Pradeshఒకప్పుడు అల్లు అర్జున్ ఇంట్లో కూలీ..ఆ హీరోయిన్ సినిమాలతో స్టార్‌గా మారిన నటుడు..!

ఒకప్పుడు అల్లు అర్జున్ ఇంట్లో కూలీ..ఆ హీరోయిన్ సినిమాలతో స్టార్‌గా మారిన నటుడు..!

అదృష్టం అనేది ఎవరికీ ఎప్పుడు ఎలా తలుపు కోడుతుందో ఎవరు చెప్పలేరు. అయితే అదృష్టం మనకి రావాలి అని రాసి ఉంటే అది ఎవ్వరూ ఆపలేరు కూడా. ప్రస్తుతం అలానే తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న ఒక నటుడుకి జరిగింది.

ఒకప్పుడు అల్లు అర్జున్ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉన్న ఆ వ్యక్తి ప్రస్తుతం తెలుగు సినిమాల్లో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు..

సినీ ప్రస్థానం : అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజపుత్ హీరోయిన్ గా చేసిన ఆర్ఎక్స్ 100 సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిన విషయమే. బోల్డ్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం దర్శకుడికా అజయ్ భూపతికి.. బోల్డ్ హీరోయిన్ గా పాయల్ కి.. అలానే హీరోగా కార్తికేయ కి మంచి పేరు తెచ్చి పెట్టింది. అయితే ఈ చిత్రంలో వీరు ముగ్గురు కాకుండా.. పేరు సంపాదించుకున్న మరో నటుడు లక్ష్మణ్ మీసాల.

హీరో పక్కన కనిపిస్తూ సినిమా మొత్తం దాదాపు తన ప్రెజన్స్ ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేశారు. ఇక ఈ మధ్య వచ్చిన అజయ్ భూపతి మరో సూపర్ హిట్ సినిమా మంగళవారంలో కూడా కీలక పాత్రలో కనిపించి మెప్పించాడు. అజయ్ భూపతి సినిమాల్లోనే కాదు.. మరి కొంతమంది దర్శకుల చిత్రాలలో కూడా నటించి తెలుగు వారి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారు ఈ ఆర్టిస్ట్.

అయితే లక్ష్మణ్ సినిమాల్లోకి రాకముందు ఏమి చేస్తుందేవాడు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అసలు విషయానికి వస్తే లక్ష్మణ్ నటుడు కాకముందు మన టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంటికి కూలీగా పనిచేసారట. అవును మీరు విన్నది లక్ష్మణ్ సినిమాల్లోకి వచ్చి సక్సెస్ సాధించే ముందు తను పడ్డ కష్టాలు వింటే మనసు చలించిపోతుంది. తాజాగా లక్ష్మణ్ మీడియాకు తన వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments