Tuesday, October 19, 2021
Homeఆంధ్రప్రదేశ్Big Breaking: మావోయిస్టు అగ్రనేత ఆర్కే కన్నుమూత

Big Breaking: మావోయిస్టు అగ్రనేత ఆర్కే కన్నుమూత

మావోయిస్టు పార్టీలో భారీ విషాదం నెలకొంది. మావోయిస్టు అగ్రనేత అలియాస్ ఆర్కే కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన మృతి చెందారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న ఆర్కే కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దక్షిణ బస్తర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఆయన మృతి చెందినట్లు సమాచారం. నాలుగు దశాబ్దాలుగా ఆయన మావోయిస్టు ఉద్యమంలో పనిచేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మావోయిస్టులతో చర్చలకు ఆహ్వానించిన సమయంలో ఆయన బయటికొచ్చారు. అనంతరం తిరిగి అడవి బాట పట్టిన ఆర్కే పలుమార్లు జరిగిన ఎన్‌కౌంటర్ల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసినట్లు తెలుస్తోంది. అయితే ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. బస్తర్ రేంజ్ ఐజీ అందుబాటులో లేరు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Translate »