Tuesday, October 19, 2021
Homeఆంధ్రప్రదేశ్గోవాలో ఘోరం: 4 గంటల్లో 26 మంది కరోనా రోగుల మృతి

గోవాలో ఘోరం: 4 గంటల్లో 26 మంది కరోనా రోగుల మృతి

గోవాలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. పనాజీలోని మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్(జీఎంసిహెచ్)లో ఘోర విషాదం చోటుచేసుకుంది. హాస్పిటల్‌లో కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే 26 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం తెల్లవారుజామున 2 నుండి 6 గంటల మధ్యలో ఈ దుర్ఘటన జరిగినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి విశ్వజీత్‌ రాణే తెలిపారు. అయితే ఈ ఘటనకు గల కారణాలపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. ‘ఆక్సిజన్ లభ్యత, జీఎంసీహెచ్‌లోని కోవిడ్-19 వార్డులకు ఆక్సిజన్ సరఫరా చేయడంలో ఆటంకం ఏర్పడటం వల్ల రోగులకు కొన్ని సమస్యలు తలెత్తి ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. గోవాలో ఆక్సిజన్ కొరత లేదని, అయితే కొన్ని సమయాల్లో సిలిండర్లు సమయానికి చేరుకోకపోవడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని విశ్వజీత్‌ రాణే తెలిపారు. ఈ ఘటనపై హైకోర్టు లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Translate »