Tuesday, October 19, 2021
Homeఆధ్యాత్మికంVijayadashami Puja: దసరా రోజు ఏయే పూజలు చేయాలో తెలుసా?

Vijayadashami Puja: దసరా రోజు ఏయే పూజలు చేయాలో తెలుసా?

దేవదానవులు పాలసముద్రాన్ని మధించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాల్లో పేర్కొన్నారు. ‘శ్రవణా’ నక్షత్రంతో కలసిన ఆశ్వయుజ దశమికి ‘విజయా’ అనే సంకేతముంది. అందుకే దీనికి‘విజయదశమి’అనే పేరు వచ్చింది. దేవీ నవరాత్రులు రామాయణ కాలంనాటికే జరుపుకోవడం ఆచారంగా ఉంది. దసరా అంటే ధన్-హరా అని, అంటే సీతను అపహరించిన పది తలల రావణుడిని సంహరించిన సందర్భంగా జరుపుకునే విజయోత్సవాన్నే దసరాగా పేర్కొంటున్నారు. ఇక నవరాత్రి వ్రతాన్ని తొమ్మిది రోజులు ఆచరించి విజయదశమి రోజున సమాప్తి చేయడం ఆచారంగా వస్తోంది. ‘ప్రథమాశైలపుత్రి, ద్వితీయా బ్రహ్మచారిణీ తృతీయాచంద్రఘంటీతి, కుష్మాండేతి చతుర్థికీ పంచమా కాళరాత్రిచ అష్టమాచాతి భైరవీ నవమా సర్వసిద్ధిశ్చాత్ నవదుర్గా ప్రకీర్తితాట.’ మూర్తులు వేరైనా మూలపుటమ్మ ఒక్కరే.. అలంకారాలు వేరైనా అమ్మ దయ అందరిపట్ల ఒక్కటే.

Also Read: Dussehra importance: విజయాన్ని చేకూర్చే విజయదశమి.. ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
విజయదశమి పూజ..
విజయదశమి నాడు ఉదయాన్నే 5 గంటలకు లేచి శుచిగా తలస్నానం చేసి ఎర్రటి వస్త్రాలు ధరించాలి. పూజామందిరం, ఇంటిని శుభ్రం చేసి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, రంగు రంగుల ముగ్గులు వేయాలి. రాజరాజేశ్వరి, దుర్గాదేవి ప్రతిమలను నల్లకలువలు, ఎర్రటి పుష్పాలతో అలంకరించాలి. నైవేద్యానికి పొంగలి, పులిహోర తయారుచేయాలి. దీపారాధనకు 9వత్తులతో కూడిన నువ్వుల దీపాన్ని సిద్ధం చేసుకోవాలి. అనంతరం పూజను ప్రారంభించి.. రాజరాజేశ్వరి అష్టకం, మహిషాసుర సంహారిణి అష్టకాన్ని పఠించాలి. వీలు కాకపోతే ‘శ్రీ మాత్రే నమః’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించి.. కర్పూర హారతులు సమర్పించుకోవాలి.
విజయదశమి నాడు ఆలయాల్లో రాజరాజేశ్వరి అష్టోత్తర పూజ, లలితసహస్రనామం, కోటికుంకుమార్చన వంటి పూజలు చేయిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. ముత్తైదువులకు తాంబూలంతో పాటు రాజరాజేశ్వరి నిత్యపూజ, దేవిభక్తిమాల వంటి పుస్తకాలను ఇవ్వడం వల్ల దీర్ఘ సుమంగళీయోగం ప్రాప్తిస్తుందట.

దసరా పూజ

దేవీ నవరాత్రులు రామాయణ కాలంనాటికే జరుపుకోవడం ఆచారంగా ఉంది. దసరా అంటే ధన్-హరా అని, అంటే సీతను అపహరించిన పది తలల రావణుడిని సంహరించిన సందర్భంగా జరుపుకునే విజయోత్సవాన్నే దసరాగా పేర్కొంటున్నారు. ఇక నవరాత్రి వ్రతాన్ని తొమ్మిది రోజులు ఆచరించి విజయదశమి రోజున సమాప్తి చేయడం ఆచారంగా వస్తోంది. ‘ప్రథమాశైలపుత్రి, ద్వితీయా బ్రహ్మచారిణీ తృతీయాచంద్రఘంటీతి, కుష్మాండేతి చతుర్థికీ పంచమా కాళరాత్రిచ అష్టమాచాతి భైరవీ నవమా సర్వసిద్ధిశ్చాత్ నవదుర్గా ప్రకీర్తితా.’ మూర్తులు వేరైనా మూలపుటమ్మ ఒక్కరే.. అలంకారాలు వేరైనా అమ్మ దయ అందరిపట్ల ఒక్కటే.
Dussehra 2021: అమృతం ఉద్భవించిన రోజు విజయదశమి.. శమీ పూజతో శని దోష నివారణ
వీటితో పాటు ‘శమీపూజ’ దశమి రోజు మరింత ముఖ్యమైంది. శమీవృక్షమంటే ‘జమ్మిచెట్టు’.పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను శమీవృక్షంపైనే దాచిపెట్టారు. అజ్ఞాతవాసం పూర్తి కాగానే ఆ వృక్షాన్ని ప్రార్ధించి, తిరిగి ఆయుధాలను పొంది, శమీవృక్ష రుపంలోని ‘అపరాజితా దేవి’ ఆశీస్సులు పొంది, కౌరవులపై విజయం సాధించినారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Translate »